Telangana : మంత్రిగా నేడు మహమ్మద్ అజారుద్దీన్ బాధ్యతల స్వీకరణ
మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ నేడు బాధ్యతలను స్వీకరించనున్నారు
మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ నేడు బాధ్యతలను స్వీకరించనున్నారు. తెలంగాణలో ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో మహమ్మద్ అజారుద్దీన్ కు మంత్రి పదవి లభించిన సంగతి తెలిసిందే. ఆయనకు ముఖ్యమంత్రి మైనారిటీ సంక్షేమం, ప్రభుత్వ రంగ శాఖలను బాధ్యతను అప్పగించారు. ఇప్పటి వరకూ మహమ్మద్ అజారుద్దీన్ మంత్రిగా బాధ్యతలను స్వీకరించలేదు.
నేడు సచివాలయంలో...
నేడు సచివాలయంలో మహమ్మద్ అజారుద్దీన్ మంత్రిగా తన బాధ్యతలను స్వీకరించనున్నారు. తొలిసారి మంత్రి అయిన మహమ్మద్ అజారుద్దీన్ తనకు అప్పగించిన మైనారిటీ సంక్షేమ శాఖకు సంబంధించి నేడు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మైనారీటీ సంక్షేమంపై మహమ్మద్ అజారుద్దీన్ అధికారులతో చర్చించనున్నారు. ఇప్పటి వరకూ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారం లో బిజీగా ఉన్న మహమ్మద్ అజారుద్దీన్ నేడు మంత్రిగా బాధ్యతలను స్వీకరించనున్నారు.