సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిందే

బిల్కిస్ బానో కేసు దోషుల విడుదలపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు

Update: 2022-08-18 12:06 GMT

బిల్కిస్ బానో కేసు దోషుల విడుదలపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఆ ఉత్తర్వులు ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని కోరారు. గర్భిణిపై అత్యాచారం చేయడమే కాకుండా మూడేళ్ల చిన్నారిని హత్య చేసిన రేపిస్టులను విడుదల చేసి గుజరాత్ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరించిందని ఆరోపించారు.ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. రేపిస్టులకు స్వాగతం పలకడం సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని కవిత ప్రశనించారు. ఈ మేరకు కవిత వరస ట్వీట్లు చేశారు.

ఆరోజు విడుదల చేయడమంటే...
అలాంటి వారిని స్వతంత్ర దినోత్సవం రోజున విడుదల చేయడం సిగ్గుచేటని కవిత అభిప్రాయపడ్డారు. తాను ఒక మహిళగా బాల్కిస్ బాను అనుభవించిన బాధను, వ్యధను అర్థం చేసుకోగలనని తెలిపారు. పౌరులకు చట్టాలపై విశ్వాసం సన్నగిల్లకుండా ఉండాలంటే వెంటనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని వారిని తక్షణమే తిరిగి జైలుకు పంపేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు, గుజరాత్ ప్రభుత్వం ఈ సిగ్గుమాలిన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరారు.


Tags:    

Similar News