ఆరోజు మా వైపే న్యాయం ఉందని ప్రూవ్ చేయగలం
ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీ ఖాన్ విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పందించారు.
ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీ ఖాన్ విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పందించారు. కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీ రద్దు అయినట్లు సగం సమాచారం తో ప్రచారం చేస్తున్నారు.. వాళ్ళ ఇద్దరి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ ప్రభుత్వం గమనిస్తుందన్నారు. పూర్తి వాదనలకు సెప్టెంబర్ 17వ తేదీ నిర్ణయించారు. ఆ రోజు మాకున్న సానుకూల అంశాలు సుప్రీంకోర్టు కు విన్నవిస్తామన్నారు. సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్ హిహరింగ్స్‌లో మా వైపే న్యాయం ఉందని ప్రూవ్ చేయగలం అని ధీమా వ్యక్తం చేశారు.
గత గవర్నర్ తప్పు బట్టిన ఖాళీలను రెండు సంవత్సరాలు నింపకుండా మా ప్రభుత్వం ఉండలేదు.. గవర్నర్ కూడా ఉండలేరు.. మా ప్రపోజల్స్ ను గవర్నర్ సానుకూల నిర్ణయం తీసుకున్నారు.. వాళ్ళు ఇద్దరు ఎమ్మెల్సీలుగా అసెంబ్లీ, మండలిలో ప్రమాణ స్వీకారం చేశారు.. సభలో కూడా పాల్గొన్నారు.. వాటి అన్నింటినీ మేము సుప్రీంకోర్టుకు వివరిస్తామన్నారు. సెప్టెంబర్ 17న వెలువరించే తీర్పులో మేము విజయం సాధిస్తామనే నమ్మకం మాకు ఉందన్నారు.
గతంలో కేసీఆర్ సరైన నియామకం చేయకపోవడం, సరైన పత్రాలు సమర్పించకపోవడంతో అప్పటి గవర్నర్ తమిళ సై తిరస్కరించారు. మా ప్రభుత్వం కేసీఆర్ లాగ కోర్టుకు వ్యతిరేకంగా కానీ రాజ్యాంగ వ్యతిరేకంగా కానీ ఏ నియామకం చేయలేదు.. ఫైనల్ హియరింగ్ లో మావైపు న్యాయం వస్తుందని నమ్మకం మాకు ఉందన్నారు.