Telangana : దానం నాగేందర్ ఇంట్లో ఎమ్మెల్యేల భేటీ.. అందుకేనా?

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంట్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు

Update: 2025-02-05 07:15 GMT

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంట్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. తమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుంటున్నారు. సుప్రీంకోర్టులో ఈ నెల 10వ తేదీన విచారణ ఉండటంతో పాటు తెలంగాణ శాసనసభ సెక్రటరీ నుంచి నోటీసులు అందడంపై వారు చర్చిస్తున్నట్లు తెలిసింది.

ఢిల్లీ వెళ్లేందుకు...
ఢిల్లీ వెళ్లేందుకు ఫిరాయించిన ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఈలోపు న్యాయనిపుణుల సలహాలు, సూచనలు తీసుకుని అడుగులు వేయాలని వారు నిర్ణయించుకునేందుకు సిద్ధమయ్యారు. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ లోకి రావడంతో కారు పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వీరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వేసిన పిటీషన్ పై విచారణకు రానున్న దశలో వీరి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.


Tags:    

Similar News