Telangana : నేడు కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేల విచారణ
పార్టీ మారిన ఎమ్మెల్యేలను నేడు కూడా స్పీకర్ కార్యాలయంలో విచారణ చేయనున్నారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలను నేడు కూడా స్పీకర్ కార్యాలయంలో విచారణ చేయనున్నారు. ఈరోజు పోచారం శ్రీనివాసర రెడ్డి, అరికెపూడి గాంధీ విచారణ జరగనుంది. తిరిగి 13న పోచారం శ్రీనివాసులు రెడ్డి, అరెకపూడి గాంధీపిటీషన్లపై రెండోసారి విచారణ జరుపుతారు. నిన్న కొందరు పార్టీ మారిన ఎమ్మెల్యేలను స్పీకర్ కార్యలయంలో విచారణ జరిపారు.
సుప్రీం ఆదేశాలతో...
సుప్రీంకోర్టు ఆదేశాలతో వరసగా విచారణను స్పీకర్ కార్యాలయం చేపట్టింది. విచారణ ఇంకా చేయాల్సి ఉన్నందున తమకు మరో రెండు నెలల సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టును స్పీకర్ కార్యాలయం కోరింది. విచారణ సందర్భంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల న్యాయవాదులు తమ వాదనలను వినిపించనున్నారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లోకి బయట వారు ఎవరికీ అనుమతి లేదని పోలీసులు తెలిపారు.