తప్పుగా అర్థం చేసుకున్నారు: బ్రహ్మానందం
ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం మోహన్ బాబు 50 ఏళ్ళ సినీ ప్రస్థానం సందర్భంగా జరిగిన ఈవెంట్ కి హాజరయ్యారు.
ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం మోహన్ బాబు 50 ఏళ్ళ సినీ ప్రస్థానం సందర్భంగా జరిగిన ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ పట్ల అమర్యాదగా ప్రవర్తించాడని, ఆయన్ని అవమానించాడని విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ వివాదంపై క్లారిటీ ఇస్తూ వీడియో విడుదల చేశారు బ్రహ్మానందం. తనది, దయాకర్ రావుది 30 ఏళ్ల స్నేహం. ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా కలుసుకుంటూ ఉంటామన్నారు బ్రహ్మానందం. మొన్న ఈవెంట్ లో ఆయన ఫోటో తీసుకుందాం అన్నారు. ఆలస్యం అయిపోతుందని ఫొటో వద్దు అన్నట్టుగా వెళ్లిపోయాను. అంతే అక్కడ జరిగింది. అందులో ఎలాంటి దురుద్దేశం లేదు. దానిని, కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ వీడియోపై క్లారిటీ ఇవ్వాలని, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దని బ్రహ్మానందం తెలిపారు.