బీఆర్ఎస్ ది నీచ రాజకీయం - ఉత్తమ్

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో ప్రమాదంపై బీఆర్ఎస్ ఓవరాక్షన్‌ చేస్తోందని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అన్నారు

Update: 2025-02-27 12:59 GMT

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో ప్రమాదంపై బీఆర్ఎస్ ఓవరాక్షన్‌ చేస్తోందని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అన్నారు. శ్రీశైలం పవర్‌ ప్లాంట్‌ ప్రమాదంలోఆరుగురు చనిపోతే పరామర్శించలేదని అన్న ఉత్తమ్ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఎస్.ఎల్.బి.సి ప్రమాదం జరిగిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కొండగట్టు బస్సు ప్రమాదంలో 62 మంది చనిపోయారని, కనీసం కేసీఆర్ అక్కడకు వెళ్లలేదన్న విషయాన్ని ఉత్తమ్ గుర్తు చేవారు.

గతంలో కేసీఆర్...
మాసాయిపేటలో చిన్నారులు ప్రాణాలు కోల్పోతే కేసీఆర్‌ కనీసం అడుగు కదపలేదని ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అన్నారు. ఇప్పుడు కావాలనే ప్రభుత్వంపై బురదజల్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఎనిమిది మందిని రక్షించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.


Tags:    

Similar News