సొంత చెల్లిలే కేటీఆర్ ను నాయకుడిగా గుర్తించడం లేదుగా

తెలంగాణ ముఖ్మమంత్రి రేవంత్‌ రెడ్డి సవాల్‌ కేటీఆర్‌కు అర్థంకానట్టు ఉందని మంత్రి సీతక్క అన్నారు

Update: 2025-07-05 12:28 GMT

సీతక్క 

తెలంగాణ ముఖ్మమంత్రి రేవంత్‌ రెడ్డి సవాల్‌ కేటీఆర్‌కు అర్థంకానట్టు ఉందని మంత్రి సీతక్క అన్నారు. అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్‌ చేస్తే ప్రెస్‌క్లబ్‌కి రమ్మనడం ఏంటి మంత్రి సీతక్క ప్రశ్నించారు. డెడ్‌ అయిన పార్టీ డెడ్‌లైన్‌ పెట్టడం విడ్డూరంగా ఉందని మంత్రి సీతక్క ఎద్దేవా చేశారు. దమ్ముంటే ఏ అంశంపైనేనా చర్చించేందుకు ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావాలని సీతక్క సవాల్ విసిరారు.

అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు...
సొంత చెల్లెలే కేటీఆర్ ను నాయకుడిగా గుర్తించడం లేదన్న సీతక్క ప్రతిపక్ష నేత అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. సమస్యలపై చర్చిద్దామంటే భయమెందుకని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న అసెంబ్లీ ఉండగా ప్రయివేటు స్థలాల్లో చర్చలు ఎందుకని ప్రశ్నించారు.క్యాడర్ లో తన నాయకత్వం పట్ల విశ్వాసం నెలకొల్పేందుకు కేటీఆర్ అవస్థలు పడుతున్నట్లుంందని సెటైర్ వేశారు.


Tags:    

Similar News