Ponnam Prabhakar : నొచ్చుకొని ఉంటే చింతిస్తున్నా
సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గురించి చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు
సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గురించి చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. తాను లక్ష్మణ్ ను ఉద్దేశించి ఎటువంటి కించపర్చే విధంగా వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో అడ్లూరి లక్ష్మణ్, తన ప్రయాణం ముప్ఫయి ఏళ్ల నుంచి కొనసాగుతుందని పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు.
తన సోదరుడు లాంటి వారని...
తాను ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలను అడ్లూరిపై చేయలేదన్న పొన్నం తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించే ప్రయత్నం చేశారన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను చూసి అడ్లూరి లక్ష్మణ్ నొచ్చుకున్నారని తెలిసిందని, దీనిపై తాను చింతిస్తున్నానని తెలిపారు. మంత్రి అడ్లూరి తనకు సోదరుడి లాంటి వారని పొన్నం ప్రభాకర్ అన్నారు. తనకు ఎవరి పట్ల విద్వేషం ఉండదని పొన్నం ప్రభాకర్ చెప్పారు.