Telangana : కేటీఆర్ పై మండి పడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు

Update: 2025-09-10 12:07 GMT

 ponnam prabhakar

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇండ్ల కూల‌గొట్టుడు గురించే కేటీఆర్ మాట్లాడ‌టం విడ్డూరంగా ఉందన్నారు. ఇదే జూబ్లిహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో చిన్న శ్రీశైలం యాద‌వ్ ఇంటిని కేటీఆర్ కూల‌గొట్టియ్య లేదా..? అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.ప‌దేండ్లు పాలించి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్క ఇల్లు అన్నా క‌ట్టించారా అని నిలదీశారు. ఎన్నిక‌లు, ఉప ఎన్నిక‌లంటే బీరు, బిర్యాని క‌ల్చ‌ర్ తెచ్చింది కేటీఆర్ మాత్రమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.

లిక్కర్ సీసాలు పంచింది....
హుజురాబాద్, దుబ్బాక, మునుగోడులో కోట్ల డ‌బ్బులు, లిక్క‌ర్ సిసాలు పంచిది టీఆర్ఎస్ మాత్రమేనన్న పొన్నం ప‌ద్దెనిమిదేళ్లు నిండితే చాలు..ఎన్నిక‌ల్లో నిర్బంధ మ‌ధ్యం విదానాన్ని అమ‌లు చేసింది వీళ్లేనని ఎద్దేవా చేశారు. జుబ్లిహిల్స్ లో బీఆర్ఎస్ గెలిస్తే లాభం లేదని, ప్ర‌భుత్వం మార‌దని, కాంగ్రెస్ ను ఆశిర్వ‌దిస్తే ఇక్క‌డ అభివృద్ది జాత‌ర‌ ఉంటుందని ఎన్నిక‌లొస్తేనే కేటీఆర్ వ‌స్తాడని, కాని మీకు ఏ అవ‌స‌రం వచ్చినా తాము అందుబాటు లో ఉన్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కూట్లో రాయిని తీయ‌ని వాడు, ఏట్లో రాయిని తీస్తాడా..? సొంత చెల్లికి న్యాయం చేయ‌లేనోడు జూబ్లిహిల్స్ కు ఏమి చేస్తాడు? అని ప్రశ్నించారు. గోపినాథ్ మీద ప్రేమ ఉంటే మంత్రి ప‌ద‌వి ఎందుకు ఇవ్వ‌లేదని నిలదీశారు.


Tags:    

Similar News