Ponnam Prabhakar : కేటీఆర్ సవాల్ కు మంత్రి పొన్నం కౌంటర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.

Update: 2025-07-05 07:45 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. తాము ప్రెస్ క్లబ్ కు రావడానికి సిద్ధమేనని అన్నారు. కేటీఆర్ తో చర్చకు తాము ఎప్పుడైనా సిద్ధమేనని అన్నారు. చర్చలకు రమ్మంటే ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్నారని, ముందు ప్రతిపక్ష నాయకుడిని అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని, ప్రెస్ క్లబ్ కు కాదు.. అసెంబ్లీకి రావాలని కోరారు.

దమ్ముంటే అసెంబ్లీకి రండి...
బేసిన్లున్నాయని, బేషజాలున్నాయన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కేటీఆర్ సవాల్ కు రెడీగా ఉన్నామని తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టుపై కూడా చర్చిద్దామని తెలిపారు. శాసనసభ అయితే భవిష్యత్ తరాలకు కూడా అన్ని విషయాలు తెలుస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తము చర్చలకు భయపడే ప్రసక్తి లేదని , రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై కూడా చర్చిద్దామని, శాసనసభలోనే చర్చిద్దామని పొన్నం కౌంటర్ ఇచ్చారు.


Tags:    

Similar News