కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఔట్.. కేటీఆర్ జోస్యం

త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఇద్దరు నేతలు ఆ పార్టీని వీడనున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Update: 2022-10-07 07:59 GMT

త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఇద్దరు నేతలు ఆ పార్టీని వీడనున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. మీడియాతో ఆయన చిట్ చాట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ 2024 ఎన్నికల నాటికి జాతీయ పార్టీగా ఎదుగుతుందని అన్నారు. దేశ రాజకీయాల్లో శూన్యత ఉందని కేటీఆర్ అన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమయిందని ఆయన అన్నారు. పొరుగు రాష్ట్రాల ప్రాంతాల ప్రజలు కూడా తెలంగాణలో కలపమని డిమాండ్ చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఇతర రాష్ట్రాల ప్రజలు ఆకర్షితులవుతున్నారని తెలిపారు.

వేటకుక్కల్లా వెంటాడినా...
ఈడీ, సీబీఐ, ఐటీ వంటి శాఖలు వేటకుక్కల్లా తమను వెంటాడతాయని తెలుసని, అయినా దేనికీ భయపడబోమని కేటీఆర్ తెలిపారు. అన్నింటికీ సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమని చెప్పారు. సుషి ఇన్ ఫ్రా పేరుతో 22 వేల కోట్ల కాంట్రాక్టును కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకున్నారని, ఐదు వేల కోట్లు ఈ ఎన్నికకు ఖర్చు పెడతానని అమిత్ షాకు ఆయన మాట ఇచ్చారని కేటీఆర్ తెలిపారు.


Tags:    

Similar News