పేరు మారింది కాని... డీఎన్ఐ మారలే

పార్టీ పేరు మారింది కాని డీఎన్‌ఏ మారలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. హుజూరాబాద్ లో జరిగిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు.

Update: 2023-01-31 12:05 GMT

పార్టీ పేరు మారింది కాని డీఎన్‌ఏ మారలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. గుర్తు మారలేదని, రంగు మారలేదని, జెండా మారలేదని, అజెండా మారలేదని అన్నారు. జమ్మికుంట లో జరిగిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. బండి సంజయ్ కు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. మసీదులు తవ్వడం కాదని, దమ్ముంటే కాల్వలు తవ్వుదాం రా అని ఛాలెంజ్ చేశారు. 14 నెలల్లో బండి సంజయ్, ఈటల రాజేందర్ ఒక్క పనిచేయలేదన్నారు. గుజరాతీలకు చెప్పుల మోయడం కాదని, సొంత గడ్డకు న్యాయం చేయాలన్నారు.

హుజూరాబాద్ లో....
ఈటల రాజేందర్ తనకు రాజకీయ బిక్ష పెట్టిన తండ్రి లాంటి కేసీఆర్ పై విమర్శలు చేయడం తగదన్నారు. కౌశిక్ రెడ్డి ఇక్కడే ఉండి అభివృద్ధి పనులు చేస్తుంటారన్నారు. రాబోయే ఆరు నెలలు ఇక్కడే ఉండి జనంలో తిరగాలని, ప్రజల మధ్యనే ఉండాలని కేటీఆర్ కోరారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ జెండా ఎగరాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. హుజూరాబాద్ ను అభివృద్ధి చేయాలంటే బీఆర్ఎస్ తోనే సాధ్యమని ఆయన అన్నారు.


Tags:    

Similar News