ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యే : కేటీఆర్

బీజేపీ కక్ష సాధింపుల చర్యలకు మనీష్ సిసోడియా అరెస్ట్ పరాకాష్ట అని మంత్రి కేటీఆర్ అన్నారు

Update: 2023-02-27 03:37 GMT

బీజేపీ కక్ష సాధింపుల చర్యలకు మనీష్ సిసోడియా అరెస్ట్ పరాకాష్ట అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన ట్విట్టర్ లో కేంద్ర ప్రభుత్వం తీరును ఎండగట్టారు. సిసోడియా అరెస్ట్ అప్రజాస్వమిక మన్నారు. మేయర్ ఎన్నికల్లో సుప్రీంకోర్టు ద్వారా చీవాట్లు తిన్న తరవ్ాత ఎదురైన పరాజయాన్ని తట్టుకోలేకనే సిసోడియాను అరెస్ట్ చేశారని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతిపక్షాల పైన బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తునన్న తీరు దుర్మార్గపూరితమైనదిగా మంత్రి కేటీఆర్ అభివర్ణించారు.

బలహీన పర్చేందుకు...
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఏజెన్సీలను ప్రతిపక్షాలపై ఉసిగొలిపి దొంగచాటు రాజకీయాలు చేయడం బీజీపీ తన అలవాటుగా మార్చుకుందన్న ఆయన ప్రజా బలం లేక అధికారంలోకి రాలేని ప్రాంతాల్లో అక్కటి పార్టీలను కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగించుకుని బలహీన పర్చే ప్రయత్నం చేస్తుందని అన్నారు. బీజేపీ ప్రతిపక్షాలపై చేస్తున్న రాజకీయ కుట్రలు దేశంలో ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారాయని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.


Tags:    

Similar News