మరో ఫ్లైఓవర్ ను ప్రారంభించిన కేటీఆర్

ఎల్బీ నగర్‌ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు పెడతామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఫ్లై ఓవర్ కు మైసమ్మ పేరు పెడతామని చెప్పారు.

Update: 2023-03-25 14:12 GMT

ఎల్బీ నగర్‌ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు పెడతామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఫ్లై ఓవర్ కు మైసమ్మ పేరు పెడతామని చెప్పారు. త్వరలోనే నగరంలో మరికొన్ని ఫ్లై ఓవర్లను ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎల్బీనగర్ చౌరస్తాలో నూతనంగా నిర్మించిన కొత్త ఫ్లై ఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నగరంలో ప్రజలు సులువుగా ప్రయాణించేందుకు వీలుగా రద్దీ ఎక్కువ ఉన్న ప్రాంతాలను గుర్తించి ఫ్లైఓవర్లను నిర్మిస్తున్నామని తెలిపారు.

సిగ్నల్ ఫ్రీగా...
సిగ్నల్ ఫ్రీగా అనేక చోట్ల ట్రాఫిక్ వెళ్లాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని అన్నారు. పెరుగుతున్న వాహనాలు, జనాభాకు అనుగుణంగా సౌకర్యాలను కూడా మెరుగుపర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో నగరవాసులు మరింత సులువుగా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు. నాగోల్‌ మెట్రో రైలును ఎల్బీ నగర్‌ వరకూ కలుపుతామని, అలాగే మెట్రోను భవిష్యత్ లో మెట్రోను హయత్‌నగర్‌ వరకు విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.


Tags:    

Similar News