నాటి హోంమంత్రి అలా.. ఇప్పటి హోంమంత్రి ఇలా

తెలంగాణలో అమిత్ షా పర్యటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు

Update: 2022-09-17 08:44 GMT

తెలంగాణలో ప్రజాస్వామ్య స్వేచ్ఛ పొందడానికి నాడు పటేల్ కృషి చేస్తే, నేడు తెలంగాణ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి వచ్చారని మంత్రి కేటీఆర్ అన్నారు. అమిత్ షాను ఉద్దేశించి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేవారు. జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎంతోమంది ఉద్యమకారుల పోరాట ఫలితమే ప్రజాస్వామ్య స్వేచ్ఛను పొందడానికి కారణమయిందన్నారు. రావి నారాయణరెడ్డి, రామనాందతీర్థ, భీంరెడ్డి నరసింహారెడ్డి, చాకలి ఐలమ్మ వంటి వారి త్యాగాలను స్మరించుకోవాలని కేటీఆర్ పిలుపు నిచ్చారు.

బెదిరించేందుకు...
అయితే ఆ తర్వాత తెలంగాణలో అమిత్ షా పర్యటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. 74 ఏళ్ల క్రితం నాటి కేంద్ర హోంమంత్రి తెలంగాణలో కలపారని, ఇప్పటి కేంద్ర హోం మంత్రి తెలంగాణను విభజించి, బెదిరించేందుకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత దేశానికి కావాల్సింది విభజన రాజకీయాలు కాదని ఆయన స్పష్టం చేశారు.


Tags:    

Similar News