మంత్రి కొండా సురేఖ కాంట్రవర్సీ కామెంట్స్
మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
konda surekha
మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫైల్స్ క్లియరెన్స్ చేయడం కోసం కొందరు మంత్రులు డబ్బు తీసుకుంటారని, తాను ఎలాంటి డబ్బు ఆశించలేదని కొండా సురేఖ తెలిపారు. ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ తాను నిజాయితీ పరులానంటూ ఆమె చెప్పుకొచ్చారు. తన లా ఎవరూ ఉండరని కూడా అన్నార.
లంచాలు తీసుకోలేదని...
ప్రభుత్వ కాలేజీ నిర్మాణానికి నాలుగున్న కోట్ల రూపాయలు ఖర్చయిందన్న కొండా సురేఖ తాను డబ్బు ఆశించకుండా కాలేజీ కట్టించానని చెప్పారు. ఇప్పుడు పార్టీలో నూ ఇది చర్చనీయాంశమైంది. మంత్రిగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పార్టీ కార్యకర్తలే ఆమె చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు.