Komatireddy Venkata Reddy : ఆ రాజీనామా లేఖ చూస్తేనే.. హరీశ్.. అర్థమవుతుంది
హరీశ్ రావు రాజీనామా లేఖను చూసి నవ్వు వచ్చిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు
komatireddy venkatareddy
హరీశ్ రావు రాజీనామా లేఖను చూసి నవ్వు వచ్చిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ప్రభుత్వం ఐదు గ్యారంటీలను అమలు చేసిందని ఆయన తెలిపారు. రాజీనామాలో ఆరు గ్యారంటీలను అమలు చేయాలని కోరడం హాస్యాస్పదం కాక మరేమిటని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. రెండు లక్షల రైతు రుణ మాఫీని ఆగస్టు పదిహేను తేదీలోగా అమలు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని, అది ఖచ్చితంగా అమలు చేేస్తుందని అన్నారు.
బీఆర్ఎస్ లో ఉద్యోగి మాత్రమే...
హరీశ్ రావు రాజీనామా చేయడం ఖాయమని అన్నారు. మళ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేయనన్న ఆయన మాట మీద నిలబడాలని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ లో హరీశ్ రావు ఒక ఉద్యోగి మాత్రమేనని అన్నారు. ఆయన కేసీఆర్ మేనల్లుడిగా మంత్రి పదవిలో ఉన్నప్పటికీ అధికారులు కూడా ఫోన్లు తీసేవారు కాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. హరీశ్ రావు కేవలం ఉద్యోగిగా కేసీఆర్ కు సూట్ కేసులు అందించడం వరకే పని అని మరోమారు ఫైర్ అయ్యారు. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయినట్లేనని, బీజేపీ ఒక్క స్థానంలో కూడా గెలవదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు.