Telangana : మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ
మావోయిస్ట్ రహిత రాష్ట్రం గా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు
మావోయిస్ట్ రహిత రాష్ట్రం గా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. శ్రీకాకుళం లో ప్రారంభం అయిన మావోయిస్ట్ 40 ఏళ్ల ఉద్యమ చరిత్ర నేడు ముగిసింది. డీజీపీ శివధర్ రెడ్డి ముందు నలుగురు కీలక మావోయిస్ట్ అగ్రనేతలు లొంగిపోయారు. దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నున్నే నరసింహ రెడ్డి లతో పాటు మరికొందరు లొంగిపోతున్నారు. ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ సెక్రెటరీ గా దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఉన్నారు. మరో అగ్ర నేత గణపతి నేపాల్ లో తలదాచుకున్నారు.
ఇప్పటి వరకూ...
మావోయిస్ట్ పై చర్యల్లో తెలంగాణ రికార్డు సృష్టించిందన్నారు. ఎస్ఐబీ ఏర్పాటు తర్వాత మావోయిస్టులపై ఎన్నో ఆపరేషన్ లు నిర్వహించింది. సోర్స్ బిల్డింగ్ తో పాటు ఇంటెలిజెన్స్ సేకరణలో కీలక పాత్రను తెలంగాణ ఎస్ఐబీ పోషించింది. ఇప్పటి వరకు 14,078 మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. 5,865 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 1289 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. 1,057 ఎన్‌కౌంటర్ లు జరిగాయి. 23 మంది కేంద్ర కమిటీ సభ్యుల సమాచార సేకరణ లో కీలకంగా ఎస్ఐబీ ఉంది. వీరిలో ఏడుగురు కేంద్ర కమిటీ సభ్యులు అరెస్ట్ అయ్యారు. మరో ఏడుగురు కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోయారు. చాలా మంది కేంద్ర కమిటీ సభ్యులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. మొత్తం 21,232 మంది మావోయిస్టులపై చర్యల్లో కీలక పాత్రను ఎస్ఐబీ పోషించింది.