Telangana : వచ్చే నెల రెండున తెలంగాణకు రాహుల్
మార్చి నెల 2వ తేదీన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నారు.
మార్చి నెల 2వ తేదీన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నారు. కాంగ్రెస్ నేతల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నేతలతో రాహుల్ గాంధీ సమావేశమయ్యే అవకాశముంది. దేశంలోనూ, రెండు రాష్ట్రాల్లోనూ జరుగుతున్న పరిణామాలపై రాహుల్ గాంధీ నేతలతో చర్చించనున్నారు.
శిక్షణ శిబిరంలో...
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు వికారాబాద్‌లో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరానికి వచ్చే నెల 2న ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరు కానున్నారు. ఆయన పర్యటన ఖరారైనట్లు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. డీసీసీ అధ్యక్షులను ఉద్దేశించి రాహుల్‌గాంధీ ప్రసంగిస్తారని, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేస్తారని వివరించారు. సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా పాల్గొంటారని తెలిపారు.