Rain Alert : వాన ముప్పు పోలేదట...మరో వారం రోజులు దబిడి దిబిడే

మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు తప్పవని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను వాతావరణ శాఖ హెచ్చరించింది

Update: 2025-08-30 04:21 GMT

మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు తప్పవని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను వాతావరణ శాఖ హెచ్చరించింది. సెప్టంబరు 2వ తేదీ తర్వాత మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశమున్నందున సెప్టంబరు 2వ తేదీ తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అనేక చోట్ల కుండపోత వర్షం పడే ఛాన్సు ఉందని, దీంతో పాటు బలైన ఈదురుగాలులు వీచే అవకాశముందని, గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో తీరం వెంట ఈదురుగాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది.

ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన...
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రంతెలిపింది. రెండు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశముందని అలెర్ట్ చేసింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లోని పదకొండు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది.
తెలంగాణలోనూ వారం రోజులు...
తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా పేర్కొంది. తెలంగాణలోని ఇరవై నాలుగు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, నారాయణ్ పేట్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, జనగామ, వరంగల్, హనుమకొండ, సిద్ధిపేట్, మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈరోజు మెజారిటీ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పింది.


Tags:    

Similar News