Weather Report : రెండు రోజుల పాటు వానలే వానలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Update: 2025-07-10 03:30 GMT

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ చెప్పింది. గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపింది.

ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్...
తెలంగాణలో కొన్ని జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈరోజు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, భువనగిరి, సిద్ధిపేట్, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్,ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ జిల్లాల్లో వర్షాలు...
ఆంధ్రప్రదేశ్ లోనూ రెండు రోజుల పాటు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్రించింది. కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కపడ, నెల్లూరు, ప్రకాశం, సత్యసాయి, కర్నూలు, పల్నాడు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారరామరాజు, మన్యం, పార్వతిపురం, విజయనగరం,శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.


Tags:    

Similar News