Rain Alert : రెండు రోజులు హై అలెర్ట్.. భారీ వర్షాలు తప్పవట

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది

Update: 2025-09-15 04:16 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని, రెండు రోజుల పాటు వర్షాలు తప్పవని హెచ్చరించింది.

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు...
తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. ఈరోజు నారాయణపేట, మహబూబ్ నగర్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నిజామాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
పిడుగులు పడే ఛాన్స్...
ఆంధ్రప్రదేశ్ లోనూ అల్పపీడనం ప్రభావంతో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. ఈ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగ ఉండాలని సూచించింది. అలాగే దక్షిణ కోస్తా, తిరుపతిలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని చెప్పింది. తీరం వెంట బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి తేలిక పాటి జల్లులు పడతాయని తెలిపింది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది.


Tags:    

Similar News