Weather Report : మూడు రోజులు భారీ వర్షాలు తప్పవు..అక్కడ అలెర్ట్ గా ఉండాల్సిందే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి ఆవర్తన ప్రభావంతో పాటు రుతుపవనాలు వేగంగా కదలడంతో వర్షాలు పడతాయని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని చెప్పింది. గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అయితే ఎక్కువగా కోస్తాంధ్రలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. కోస్తాంధ్ర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు పడతాయని కూడా చెప్పింది. అలాగే రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని,ముప్ఫయి నుంచి నలభై డిగ్రీల వరకూ నమోదవుతాయని వాతావరణకేంద్రంతెలిపింది.
తెలంగాణలో మూడు రోజులు...
విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో నలభై డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం చెప్పింది. అయితే సాయంత్రానికి వాతావరణం చల్లగా మారుతుందని పేర్కొంది. ఈ నెల 27వ తేదీ వరకూ ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయని అమరావతి వాతావరణకేంద్రం తెలిపింది. తెలంగాణలోనూ రాగల మూడు రోజుల పాటు వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
ఈ జిల్లాల్లో వర్షాలు...
కొన్ని చోట్ల భారీ వర్షాలు మరికొన్నిచోట్ల మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములతో కూడినజల్లులు పడే అవకాశముందని చెప్పింది. ఈరోజు తెలంగాణలోని కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, భువనగిరి, సిద్ధిపేట్, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట్, నల్లగొండ, ఖమ్మం, కొత్తగూడెం్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్,మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షం పడుతుందని హైదరాబాద్వాతావరణ కేంద్రం పేర్కొంది.కొన్ని ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.