Weather Report : మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు .. అతి భారీ వర్షాలేనట

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

Update: 2025-07-09 04:08 GMT

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటు కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాల్లో తేలిక పాటి జల్లులు పడతాయని పేర్కొంది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని, గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. ప్రజలు హోర్డింగ్ లు చెట్ల కింద ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది.

తెలంగాణలో ఈ జిల్లాలో...
అయితే కొన్ని జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈరోజు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబాబాద్, నల్లగొండ, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలెర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు...
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడంతో పాటు అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో ఆంద్రప్రదేశ్ లోనూ మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరకోస్తా ప్రాంతంలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తా ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ చెప్పింది. రాయలసీమలో మాత్రం తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.


Tags:    

Similar News