Weather Report : రెయిన్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ రెండు రాష్ట్రాల్లో వానలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో మరో వారం రోజుల పాటు వర్షం పడే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది

Update: 2025-06-18 03:49 GMT

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో మరో వారం రోజుల పాటు వర్షం పడే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు విస్తరిస్తుండటంతో పాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో భారీ వర్షాలు మరింతగా పడే అవకాశముందని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్ష పాతం నమోదయ్యే అవకాశముందని, అలాగే పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే రాయలసీమలోని నాలుగు జిల్లాలైన చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడపలలో తేలికపాటి జల్లులతో పాటు మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది.

ఐదు రోజులు భారీ వర్షాలు...
తెలంగాణలోనూ భారీ వర్షాలు ఐదు రోజుల పాటు కొనసాగుతాయని తెలిపింది. అనేక జిల్లాల్లో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని కూడా తెలిపింది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానంగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు కనిష్టంగా తగ్గుతాయని, చెప్పింది. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఐదు రోజులు ఉక్కపోత వాతావరణం నెలకొంటుందని తెలిపింది. గత కొద్ది రోజులుగా చలి వాతావరణం ఉన్న తెలంగాణలో రానున్న ఐదు రోజుల్లో ఉక్కపోత ఉంటుందని, ఫ్యాన్, ఏసీల వాడకం పెరిగే అవకాశముంది.
ఈ జిల్లాల్లో...
తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అయితే ఈరోజు మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. ఈ ప్రాంతాల్లో అధిక వర్షాలు నమోదవుతాయని, మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. కొన్ని చోట్ల వడగళ్ల వాన కూడా కురిసే అవకాశాలున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా రైతులు సాగుకు అనుకూలమైన వర్షం పడుతుండటంతో అన్నదాతలు ఖరీఫ్ పనులు ప్రారంభించుకోవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. విత్తనాలు నాటేందుకు ఇది సరైన సమయమని చెబుతున్నారు.


Tags:    

Similar News