ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నేడు వర్షం పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశలనుంచి గాలులు వీస్తున్నాయని ఫలితంగా.. రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. గురువారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వానలు కురిసినట్టు పేర్కొన్నది.
తెలంగాణలో నేడు...
తెలంంగాణలో ఈరోజు జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమరం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు పడుతుండటంతో ఈరోజు మరింతగా విస్తరించి కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండి సాగుకు సిద్ధమవ్వాలని సూచిస్తున్నారు.
ఏపీలో ఇక్కడ వర్షాలు...
ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ ఈరోజు వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. పల్నాడు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఖరీఫ్ పనులకు సిద్ధంగా ఉన్న రైతులకు ఇప్పుడు కురుస్తున్న వర్షాలు మంచివేనని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో నేడు యోగా డే వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుండటంతో వర్షం కురిస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసినట్లు అధికారులు తెలిపారు.