Weather Report : అతి భారీ వర్షాలు..తెలుగు రాష్ట్రాల్లో కురిసేది ఎక్కడెక్కడంటే
మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మరో అల్పపీడనం సిద్ధంగా ఉంది. ఈ నెల 13వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అనేక ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింద.ి
ఈ జిల్లాల్లో నేడు...
ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర, పశ్చిమ గోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భఆరీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులు కొన్ని ప్రాంతాల్లో పడతాయని చెప్పింది.
అతి భారీ వర్షాలు...
తెలంగాణలోనూ మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 10వ తేదీ నుంచి పదిహేను వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని కూడా హెచ్చరించింది. అతి భారీ వర్షాలకు తోడుగా బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపింది. యాదాద్రి భువనగిరి, జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబబాద్, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి,పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫా బాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ నెల 14వ తేదీ వరకూ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడతాయని పేర్కొంది.