Rain Alert : ఈరోజు ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఎక్కడెక్కడంటే?

ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

Update: 2025-08-21 04:20 GMT

ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఈ వర్షాలు పడతాయని చెప్పింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ప్రాజెక్టులు నిండిపోయాయి. అన్ని గేట్లు ఎత్తివేశారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుల చేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అదే సమయంలో పునరావాసకేంద్రాలను కూడా సిద్ధం చేశారు. గోదావరి, కృష్ణానదుల్లో వరద నీరు భారీగా చేరడంతో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

ఐదు రోజులు తెలంగాణలో...
తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈరోజు వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, నిజామాబాద్, నిర్మల్, ములుగు, మేడ్చల్ మల్కాజ్ గిరి, మంచిర్యాల, మహబూబాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దాదాపు ఇరవై జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు వంకలు దాటే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింద.ి
అన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్...
ఆంధ్రప్రదేశ్ లోనూ మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతవరణ శాఖ తెలిపింది. అనేక చోట్ల మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం పడుతుందని, పిడుగులు పడే అవకాశముందని కూడా హెచ్చరించింది. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అల్లూరి, పార్వతీపురం మన్యం, విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరికలను కంటిన్యూ చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశముందని, అల్పపీడనం ప్రభావంతో ఈ వర్షం పడుతుందని తెలిపింది.
Tags:    

Similar News