Rain Alert : మరో మూడు రోజులు భారీ వర్షాలు.. రెండు రాష్ట్రాలకు అలెర్ట్

ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది

Update: 2025-07-18 03:43 GMT

ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలను వేగంగా కదులుతుండటంతో పాటు పశ్చిమగాలులు బలంగా వీస్తుండటం, ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలుఅప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయాని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణలో ఎల్లో అలెర్ట్...
తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరరుపులోకూడిన గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపింది. ఈరో్జు తెలంగాణలోని నాగర్ కర్నూల్, భువనగిరి, హన్మకొండ,వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్చాజ్ గిరి జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని తెలిపింది. ఆదివారం వరకూ ఈ భారీ వర్షాలు తప్పవని చెప్పింది. కొన్నిజిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే జిల్లాలకు ఈ అలెర్ట్ జారీ చేసింది.
ఏపీలో ఈ ప్రాంతంలో...
ఆంధ్రప్రదేశ్ లోనూ మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని విశాఖవాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. దక్షిణ కోస్తా ప్రాంతంలో తేలికపాటి నుంచిమోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులుపడతాయని చెప్పింది. ఉత్తర కోస్తా ప్రాంతంలో కొన్నిచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశముందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక రాయలసీమలో ఈరోజు మోసర్తు వర్షాలు పడతాయని, అదే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంపడుతుందని కూడా విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


Tags:    

Similar News