Telangana : తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్
తెలంగాణలో వచ్చే వారం రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఉత్తర కర్నాటక పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. 13న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది.తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానలు కురియనున్నాయని చెప్పింది. తెలంగాణలో వచ్చే వారం రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలోని 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది.
ఏపీలో నాలుగు రోజులు...
దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం ఆవరించిందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ కు నాలుగు రోజులు వర్ష సూచన చేసింది. నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈనెల 13, 14న ఏపీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది.పలుచోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.