Weather Report : ముఖం చాటేసిన వర్షాలు.. ఖరీఫ్ సాగుకు ఇబ్బందులేనా?

రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వర్షాలు పడతాయని వాతవారణ శాఖ తెలిపింది

Update: 2025-07-14 03:52 GMT

వాతావరణ శాఖ చెబుతున్నప్పటికీ వర్షాలు పడటం లేదు. రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వర్షాలు పడతాయని వాతవారణ శాఖ తెలిపింది. అయితే వాన జాడ మాత్రం కనిపించడం లేదు. వాతావరణ శాఖ చెప్పినట్లుగా వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖం చాటేశాయి. నైరుతి రుతువపనాలు ముందుగానే ప్రవేశించి కొంత వర్షాలు ముందుగానే ప్రారంభమవ్వడంతో అన్నదాతల ఆనందం ఖరీఫ్ సాగు సమాయానికి వానలు పడకపోవడంతో ఆనందం ఆవిరి అయిపోయింది. జులై రెండో వారం దాటినా సరైన వర్షపాతం లేదు. అనేక ప్రాంతాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉండటంతో రైతులు ముఖ్యంగా ఆందోళన చెందుతున్నారు.

ఈదురుగాలులు బలంగా...
అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ మాత్రం మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. జోగులాంబ గద్వాల్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను హైదరాబాద్ వావతావరణ కేంద్రం జారీ చేసింది. ఈరోజు కూడా తేలికపాటి వర్షాలతో పాటు గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన తెలిపింది.
తేలికపాటి జల్లులు...
ఈశాన్య బంగాళాఖాతం వరకూ ద్రోణి కొనసాగుతున్నందన తేలికపాటి జల్లులు పడతాయని తెలిపింది. అయితే ఆశించిన స్థాయిలో వర్షాలు పడవని కూడా విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే కృష్ణా, గోదావరి నదిలో వరద నీరు పెరుగుతున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ గోదావరి పరివాహక ప్రాంత జిల్లా కలెక్టర్లను అలెర్ట్ చేసింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ధవళేశ్వరం ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు, జూరాల ప్రాజెక్టులో వరద నీరు పెరుగుతుంది. దీంతో ప్రజలు అలెర్ట్ గా ఉండాలని, వరద నీరు పెరుగుతుంటే వెంటనే లోతట్టు ప్రాంత ప్రజలు గ్రామాల నుంచి ఖాళీ చేసి పునరావాస కేంద్రాలు తరలించాలని ఆదేశించారు.


Tags:    

Similar News