Weather Report : వాతావరణ కేంద్రం ఏం చెప్పిందంటే.. ఇక్కడ మాత్రం వర్షాలేనట
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న రానున్న రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలో భారీ వర్షాలతో పాటు మోస్తరు నుంచి తేలిక పాటి జల్లులు కురిసే అవకాశముందని కూడా పేర్కొంది. ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉందని, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని కూడా అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. అయితే ఇదే సమయంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పట్టే అవకాశముందని, చల్లటి వాతావరణం అన్ని జిల్లాల్లో ఉంటుందని తెలిపింది.
ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు...
ఉత్తర్ కోస్తాంధ్రలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుపడే అవకాశముందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. మెరుపులతో కూడిన వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని, గంటకు నలబై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. వేడితో పాటు తేమతో కూడిన వాతావరణం ఏర్పడుతుందని చెప్పింది. దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే రాయలసీమమలో ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఈదురుగాలులు కూడా బలంగానే వీస్తాయని, ప్రజలు అలెర్ట్ గా ఉండాలని కూడా వాతావరణకేంద్రం కోరింది.
తెలంగాణలోనూ రెండు రోజులు...
తెలంగాణలోనూ రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు జోగులాంబ గద్వాల్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, కామారెడ్డి, మెదక్, వికారాబాద్, మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్ి, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రైతులు ప్రధానంగా అప్రమత్తంగా ఉండాలని కోరింది. పలుచోట్ల వడగళ్ల వాన కురిసే అవకాశముందని కూడా పేర్కొంది.