Weather Report : మరో అల్పపీడనం... నేటి నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్

బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతవావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది

Update: 2025-08-24 05:05 GMT

బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతవావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఇప్పటి వరకూ వర్షాలు కొంత తగ్గుముఖం పట్టినా మరొక అల్పపీడనం ప్రభావంతో వర్షాలు విరివిగా కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. అలాగే గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

తెలంగాణలోనూ వర్షాలు..
తెలంగాణలోనూ ఈరోజు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది.ఈ ప్రభావంతో అనేక జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ నెలలో ఇప్పటికే తెలంగాణలో పంధొమ్మిది శాతం వర్షపాతం అధికంగా నమోదయిందని వాతావరణ శాఖ చెప్పింది. సంగారెడ్డి, వనపర్తి, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, పెద్దపల్లి, ములుగు వంటి ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశముందని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ లోనూ...
అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోనూ భారీ వర్షాలు కూడా పడతాయని పేర్కొంది. ఉరుములతో కూడిన వర్షం పడుతుందని చెప్పిదంి. గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని కూడా విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే అల్పపీడనం ఏర్పడనుందా? లేదా? అన్నది మరికొద్ది గంటల్లోనే తేలనుందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రాజెక్టులు పొంగి ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అలెర్ట్ గా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.


Tags:    

Similar News