Weather Report : వాతావరణ శాఖ సూచనలు విన్నారా? అయితే అలెర్ట్ గా ఉండాల్సిందే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది

Update: 2025-06-22 04:05 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో పాటు ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు దంచికొడతాయని చెప్పింది. ఖరీఫ్ సీజన్ మొదలు కావడంతో రైతులు కూడా వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే రానున్న రెండు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిసింది. ఈ మేరకు రైతులకు వాతావరణ శాఖ తీపికబురు అందించింది. ఇప్పుడు పడే వర్షాలతో ఖరీఫ్ సాగుకు సులువుగా మారుతుందని, వరుణుడు కరుణించాలని అన్నదాతలు కోరుకుంటున్న సమయంలో వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.

బలమైన ఈదురుగాలులు...
ఆంధ్రప్రదేశ్ లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయనిచెప్పింది. గంటకు నలభై కిలోమీటర్ల నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా తెలిపింది. భారీ వర్షాలు పడతాయని ప్రజలు కొన్ని ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చసింది. కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశముందని అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని కూడా వార్నింగ్ ఇచ్చింది. ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, చెట్లకింద హోర్డింగ్ ల కింద నిల్చోవద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది.
ఈరోజు తెలంగాణలో ఈ జిల్లాల్లో...
తెలంగాణలోనూ రానున్న రెండు రోజులు పాటు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా చెప్పింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడి బలమైన గాలులతో కూడిన వర్షం పడనుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. ఈరోజు నాగర్ కర్నూల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు పడతాయని చెప్పింది.


Tags:    

Similar News