Rain Alert :ఈ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే.. అతి భారీ వర్షాలు పడే అవకాశం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Update: 2025-05-29 03:55 GMT

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.తీరం వెంబడి ఈదురు గాలులు కొనసాగుతున్నాయి. రుతుపవనాల ప్రభావంతో వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని అధికారుల హెచ్చరిక జారీ అయింది. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశముందని కూడా తెలిపింది. ఉత్తరాంధ్ర నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకూ బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశముందని తెలిపింది.

అల్పపీడనం ప్రభావంత....
ఈరోజు ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా చెప్పింది. దక్షిణ కోస్తాలో కూడా వర్షాలు పడే అవకాశముందని చెప్పింది.రాయలసీమ ప్రాంతంలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, బలమైన ఈదురుగాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని, రైతులు, పశువుల కాపర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. చెట్ల కింద ఉండకుండా అప్రమత్తంగా ఉండాలని కోరింది.
తెలంగాణలో మూడు రోజులు ....
ఇక తెలంగాణలోనూ మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈరోజు తెలంగాణలోని ఐదు జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ ను వాతావరణ కేంద్రం జారీ చేసింది. అదే సమయంలో పదిహేను జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసిన వాతావరణశాఖ రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈరోజు పెద్దపల్లి, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మహబూబ్ నగర్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మల్కాజ్ గిరి, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది.


Tags:    

Similar News