భావోద్వేగంతో అన్న మాటలే : కోమటిరెడ్డి

చెరుకు సుధాకర్ ను దూషించలేదని పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

Update: 2023-03-06 06:24 GMT

చెరుకు సుధాకర్ ను దూషించలేదని పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మీడియా సభ్యులతో చిట్ చాట్ చేశారు. తాను భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలేనని ఆయన తెలిపారు. అంతే తప్ప వేరే ఉద్దేశ్యం లేదన్నారు. తన శత్రువులను కూడా తాను దగ్గరకు తీసుకుంటానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. తన రాజకీయ జీవితంలో ప్రత్యర్థులను కూడా తాను ఎన్నడూ దూషించలేదన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను మాట్లాడిన మాటల్లో కొన్ని విషయాలను మాత్రమే వారు బయటపెట్టారన్నారు.

రికార్డు చేస్తారని తెలిసి...
రికార్డు చేస్తారని తెలిసి, తాను నేరుగా రెగ్యులర్ ఫోన్ నుంచి ఎందుకు ఫోన్ చేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. పార్టీలో చేరినప్పటి నుంచి చెరుకు సుధాకర్ తనను తిడుతూనే ఉన్నాడన్నారు. ఎందుకు తిడుతున్నారని మాత్రమే ఆయన కొడుకుకు ఫోన్ చేసి అడిగానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తనను తిట్టొద్దని చెప్పాను తప్పించి తాను హత్య చేస్తానని బెదిరించలేదన్నారు. నకిరేకల్ లో తనపై పోస్టర్లు వేసిన వారు ఎవరో తనకు తెలుసునన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అనుచరులు చంపేస్తారేమోనని భయంతోనే తాను ఫోన్ చేశానని అన్నారు.


Tags:    

Similar News