Mega DSC Notification:రేపే మెగా డీఎస్సీకి నోటిఫికేషన్.. ఎన్ని ఉద్యోగాలంటే?
తెలంగాణలోని రేవంతర్ రెడ్డి ప్రభుత్వం మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది
Telangana DSC results 2024
Mega DSC Notification:తెలంగాణలోని రేవంతర్ రెడ్డి ప్రభుత్వం మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మొత్తం 11,062 ఉపాధ్యాయుల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 29న విడుదలయ్యే అవకాశం ఉంది. షెడ్యూల్ ఖరారు, సాఫ్ట్ వేర్ రూపకల్పన కారణంగా నోటిఫికేషన్ ఇవ్వడానికి ఒక రోజు ఆలస్యం కానుందని అధికారులు తెలిపారు. 11,062 పోస్టుల్లో 6,500 పోస్టులు ఎస్జీటీలు ఉన్నాయి. తెలంగాణలో దాదాపు 4 లక్షల మంది ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణులయ్యారు. డీఎస్సీ ప్రక్రయలో ఎక్కడా ఎలాంటి సమస్య తలెత్తకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు డీఎస్సీకి సంబంధించిన నివేదికను విద్యాశాఖ సిద్ధం చేసి సీఎం కార్యాలయానికి పంపింది. అక్కడి నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. డీఎస్సీ నిర్వహణపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేశారు. టీచర్ల పదోన్నతులు, బదిలీల్లో ఇబ్బందులపై దృష్టిసారించాలని సీఎం సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులు లేరనే సాకుతో మూసేసిన బడులను మళ్లీ తెరిపించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.