Telangana : నేడు మేడారానికి ఇద్దరు మంత్రులు
నేడు మేడారం పర్యటనకు ఇద్దరు మంత్రులు బయలుదేరి వెళ్లనున్నారు
నేడు మేడారం పర్యటనకు ఇద్దరు మంత్రులు బయలుదేరి వెళ్లనున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క లు నేడు మేడారంలో పర్యటించనున్నారు. మేడారంలో జరిగే అభివృద్ధి పనులను ఇద్దరూ పరిశీలించనున్నారు. ఉదయం హెలికాప్టర్ లో చేరుకుని ముందుగా అమ్మవార్లను దర్శించుకుంటారు. అనంతరం మేడారం మహాజాతర పనులను పరిశీలిస్తారు. ఈ సందర్భంగా అధికారులతో ఇద్దరు మంత్రులు సమీక్ష జరపనున్నారు.
పనుల పురోగతిపై...
పనులు ఎప్పటి లోగా పూర్తవుతాయి? అన్న దానిపై కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకోనున్నారు. మేడారం జాతర జరిగే ప్రాంతం మొత్తం పర్యటించి పనుల పురోగతిని స్వయంగా పరిశీలించిన అనంతరం ఇద్దరు మంత్రులు తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు. ఉదయం 10.45 గంటలకు ఇద్దరు మంత్రులు మేడారానికి చేరుకుని ఒంటి గంట వరకూ అక్కడ ఉండి తర్వాత హైదరాబాద్ కు తిరిగి వస్తారు. అయితే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఈ పర్యటనకు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది.