కామారెడ్డి లో టెన్షన్.. టెన్షన్
బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒకరికొకరు బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించడంతో కామారెడ్డిలో టెన్షన్ నెలకొంది
కామారెడ్డి లో టెన్షన్ నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒకరికొకరు బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించడంతో ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు, శిశు మందిర్ పాఠశాల, అరోరా కాలేజీ భూముల కబ్జా విషయంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు పరస్పర ఆరోపణలు చేస్తున్నాయి. నిజా నిజాలు తేల్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి సవాల్ విసిరారు.
బహిరంగ చర్చకు...
చర్చకు సిద్ధమన్న కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. శిశు మందిర్ వేదిక కు చర్చకు రెండు పార్టీల సిద్ధం అని ప్రకటించడంతో కామారెడ్డి లో టెన్షన్ నెలకొంది.కాంగ్రెస్ నాయకులు సాక్ష్యాధారాల తో చర్చకు రావాలంటూ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి కోరారు. కాంగ్రెస్ బీజేపీ నేతల బహిరంగ చర్చకు అనుమతి లేదంటున్న పోలీసులు ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.