Revanth Reddy : నేడు వికారాబాద్ జిల్లాకు రేవంత్

నేడు వికారాబాద్‌ జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు

Update: 2026-02-21 03:29 GMT

నేడు వికారాబాద్‌ జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనంతగిరి హిల్స్ చేరుకోనున్నారు. అనంతగిరి రిసార్ట్స్‌లో ఏపీ, తెలంగాణ కాంగ్రెస్‌ శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల శిక్షణ తరగతులకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారుు.

డీసీసీ అధ్యక్షుల...
తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులకు శిక్షణా తరగతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. పార్టీ బలోపేతానికి రెండు రాష్ట్రాల్లో తీసుకోవాల్సిన చర్యలపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ శిక్షణ కార్యక్రమాలకు రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కూడా హాజరై తమ అనుభవాలను పంచుకోనున్నారు.


Tags:    

Similar News