Sajjanar : ఆర్టీసీ లోగో మార్పుపై సజ్జనార్ ఏమన్నారంటే?

తెలంగాణ ఆర్టీసీ కొత్త లోగోపై మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ స్పందించారు

Update: 2024-05-23 07:48 GMT

తెలంగాణ ఆర్టీసీ కొత్త లోగోపై మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ స్పందించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాహనాల రిజిస్ట్రేషన్లను టీఎస్ నుంచి టీజీగా మార్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్టీసీ కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలకు కూడా టీజీ రిజిస్ట్రేషన్ తో బయటకు వస్తున్నాయి. కానీ సోషల్ మీడియాలో టీఎస్ ఆర్టీసీ నుంచి టీజీ ఆర్టీసీగా మారిందని ప్రచారం జరిగింది. దీనికి సంబంధించిన లోగో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇప్పటి వరకూ...
అయితే టీఎస్ నుంచి టీజీగా మార్చడం నిజమేనని, అయితే తెలంగాణ ఆర్టీసీ లోగోపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అధికారికంగా తాము ఆర్టీసీ కొత్త లోగోను విడుదల చేయలేదని సజ్జనార్ తెలిపారు. ఆ లోగోతో తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని సజ్జనార్ తెలిపారు. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తుందని, అది రాగానే తామే అధికారికంగా విడుదలచేస్తామని చెప్పారు.


Tags:    

Similar News