మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి కోటి రూపాయల పరిహారం
సిగాచీ రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు యాజమాన్యం కోటి రూపాయల పరిహారం ఒక్కొక్కరికి ఇవ్వాలని ఆదేశించారు
పాశమైలారంలోని సిగాచీ రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు యాజమాన్యం కోటి రూపాయల పరిహారం ఒక్కొక్కరికి ఇవ్వాలని ఆదేశించారు. గాయపడి ఇక ఇంటికే పరిమితమయిన వారికి పది లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని, గాయపడిన వారికి ఒక్కొక్కరికి ఐదు లక్షలు ఇవ్వాలని పరిశ్రమ యాజమాన్యాన్ని ఆదేశించడం జరిగిందన్నారు. సిగాచీ పరిశ్రమ ప్రమాదం అత్యంత దురదృష్టకరమని తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో...
దుర్ఘటన జరిగిన సమయంలో 143 మంది కార్మికులు ఫ్యాక్టరీలో ఉన్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇటువంటి ప్రమాదం తెలంగాణలో ఇప్పటి వరకూ జరగలేదు. గాయపడిన వారికి ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని తెలిపారు. ప్రమాదం జరగడానికి గల కారణాలను లోతుగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించామని రేవంత్ రెడ్డి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెపపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి తెలిపారు.