Telangana : విద్యుత్తు అవసరాలు పెరుగుతున్నాయ్
విద్యుత్తు అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు
విద్యుత్తు అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరాల్లో ఒకటిగా చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. విద్యుత్తు రంగంపై ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. 2047 వరకూ మూడు ట్రిలియన్ ఎకానమీకి చేరుకోవాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందని చెప్పారు. అందుకు పెట్టుబడులు అవసరమవుతాయని, పెట్టుబడులు కావాలంటే విద్యుత్తు అవసరమని మల్లు భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు.
డిమాండ్ పెరగడంతో...
విద్యుత్తు డిమాండ్ పదేళ్ల నుంచి రాష్ట్రంలో విపరీతంగా పెరుగుతుందని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. డేటా సెంటర్ల ఏర్పాటుతో హైదరాబాద్ గ్లోబల్ హబ్ గా మారబోతుందని తెలిపార. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో పాటు విద్యుత్తు రంగాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, పెరుగుతున్న విద్యుత్తు వినయోగానికి తగినట్లుగా ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తుందని తెలిపారు. 2047 నాటికి లక్షా 39 వేల మెగావాట్ల విద్యుత్తు అవసరమని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.