చెంపపగలగొట్టిన ఈటల రాజేందర్
మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప పగలకొట్టారు.
మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప పగలకొట్టారు. మల్కాజ్ గిరి ఏకలవ్య నగర్ లో పేదల ఇళ్లను కాజేసి వ్యాపారం చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారిపై ఆయన చేయి చేసుకున్నారు. దీంతో ఈటల రాజేందర్ పక్కనే ఉన్న పార్టీ కార్యకర్తలు కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై దాడులకు దిగారు.
రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై...
పేదల ఇళ్లను కాజేస్తూ అక్రమ పత్రాలను సృష్టించి రెవెన్యూ, పోలీసు అధికారులను మెయిన్ టెయిన్ చేసుకుంటూ పేదలను బెదిరిస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఏకశిలా నగర్ లో దాదాపు 149 ఎకరాలను రియల్ ఎస్టేట్ బ్రోకర్లు తప్పుడు పత్రాలు సృష్టించి అమ్ముకున్నారని పేదలు ఫిర్యాదు చేయగా, ఆయన ఈ చర్యకు దిగారు. ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించిన వారిని జైల్లో పెట్టాలంటూ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.