నేడు జూరాల ప్రాజెక్టుకు మంత్రి ఉత్తమ్

భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు జూరాల ప్రాజెక్టును సందర్శిస్తారు.

Update: 2025-06-28 02:28 GMT

భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు జూరాల ప్రాజెక్టును సందర్శిస్తారు. జూరాల ప్రాజెక్టులు గేట్లు తెగడంతో వాటిని పరిశీలించనున్నారు. నిన్న నీటి పారుదల శాఖ ఉన్నత స్థాయి అధికారి రాహుల్ బొజ్జా పరిశీలించి గేట్ల పరిస్థితిపై సమీక్ష జరిపారు. నేడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించి గేట్ల మరమ్మతులకు సంబంధించి అధికారులతో చర్చించనున్నారు.

అధికారులతో సమీక్ష...
మూడు కోట్ల రూపాయలు అవసరమవుతుందని అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. జూరాల ప్రాజెక్టు వద్ద అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించి ప్రాజెక్టు పరిస్థితిపై చర్చించనున్నారు. జూరాల క్లస్ట్ గేట్లను పరిశీలించిన అనంతరం మంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందించిన అనంతరం తిరిగి హైదరాబాద్ కు బయలుదేరుతారు. మరోవైపు నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు పర్యటిస్తారు. అమీన్ పూర్ లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించనున్నారు.


Tags:    

Similar News