Telangana : 40 లక్షలు ఇచ్చి.. ఆల్ ది బెస్ట్ చెప్పిన కేసీఆర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు పార్టీ అధినేత కేసీఆర్ నలభై లక్షలు అందించారు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు పార్టీ అధినేత కేసీఆర్ నలభై లక్షలు అందించారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ మాగంటి సునీతకు పార్టీ తరుపున నలభై లక్షల చెక్కును అందచేశారు. మాగంటి సునీత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఖర్చు చేసుకోవడం కోసం పార్టీ నుంచి ఆమెకు ఈ చెక్కును కేసీఆర్ సునీతకు అందచేశారు.
బీఫారం అందచేసి...
దీంతో పాటు పార్టీ అభ్యర్థిగా కేసీఆర్ మాగంటి సునీతకు బీఫారంను అందచేశారు. ఎన్నికల ఖర్చుకోసం నలభై లక్షలు ఇచ్చిన కేసీఆర్ సునీతకు ఆల్ దిబెస్ట్ చెప్పారు. మాగంటి గోపీనాధ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చే నెల 11వ తేదీన జరగనుంది. రేపు మాగంటి సునీత తన నామినేషన్ ను దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఆమె ప్రచారాన్ని ప్రారంభించారు.