మందు బాబులకు షాకింగ్ న్యూస్...

మద్యం దుకాణాలు రెండు రోజుల పాటు బంద్ చేయనున్నారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది

Update: 2023-11-26 05:06 GMT

మద్యం దుకాణాలు రెండు రోజుల పాటు బంద్ చేయనున్నారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 28వ తేదీ నుంచి మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. తిరిగి 30వ తేదీ పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. దాదాపు రెండు రోజుల పాట తెలంగాణలో మద్యం విక్రయాలపై నిషేధం ఉండనుంది. దీంతో మద్యం ప్రియులకు షాక్ అయిన వార్త అని చెప్పాలి.

ఎన్నికల నేపథ్యంలో...
తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ నెల 28వ తేదీ వరకూ ప్రచారం జరగనుంది. ప్రచారం ముగిసిన వెంటనే మద్యం దుకాణాలు బంద్ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దీంతో ఎక్సైజ్ శాఖ అన్ని మద్యం దుకాణాలను ఈనెల 28వ తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి బంద్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. రెండు రోజుల పాటు మద్యం అందుబాటులో ఉండకపోవడంతో మద్యం ప్రియులు ముందుగానే కొనుగోలు చేసి పెట్టుకునేందుకు వైన్ షాపుల వద్ద క్యూ కడుతున్నారు.

Tags:    

Similar News