Telangana : బోనులో చిక్కిన చిరుతపులి

తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో భయపెట్టిన చిరుతపులి చివరకు చిక్కింది.

Update: 2025-09-15 11:44 GMT

తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో భయపెట్టిన చిరుతపులి చివరకు చిక్కింది. అటవీ శాఖ అధికారులు వేసిన వలలో పడింది. దేవునిగుట్ట, వీరన్నపేట ప్రాంతాల్లో సంచరిస్తూ చిరుతపులి భయభ్రాంతులకు గురి చేసింది. గత కొద్దిరోజులుగా భయపెడుతున్న చిరుతపులితో ప్రజలు భయాందోళనల మధ్య బతుకుతున్నారు.

మహబూబ్ నగర్ జిల్లాలో...
అయితే దీంతో అటవీ శాఖ అధికారులు డ్రోన్ ల సాయంతో నిఘా ఏర్పాటు చేశారు. అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత ఎట్టకేలకు చిక్కింది. దీతో కొన్నాళ్ల నుంచి భయపెడుతున్న చిరుతపులి బోనులో పడటంతో అటవీ శాఖ అధికారులు చిరుతపులిని జూకు తరలించే ఏర్పాట్లు చేశారు. దీంతో మహబూబ్ నగర్ జిల్లాలో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News