Leopard : మెదక్ జిల్లాలో చిరుత సంచారం

మెదక్ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతుంది.

Update: 2025-03-01 04:38 GMT

మెదక్ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. రామయం పేట మండల కేంద్రంలో జాతీయ రహదారిపై చిరుత పులి కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. భయంతో పరుగులు తీశారు. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందిచారు. జాతీయ రహదారి పక్కనే చిరుత పులి ఉండటంతో పాటు అంతకు ముందు ఇదే ప్రాంతంలో డబుల్ బెడ్ రూమ్ కేసీఆర్ కాలనీలో కూడా పశువులపై దాడి చేసిన ఘటనతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు.

పాదముద్రలను గుర్తించి...
అయితే సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని పులి పాదముద్రలను గుర్తించారు. చిరుతపులి ఇక్కడే సంచరిస్తుందని ధృవీకరించుకున్న అధికారులు గ్రామస్థులు రాత్రి వేళ ఒంటరిగా బయటకు రావద్దని, పశువులను కూడా బయటకు తీసుకు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పొలాల వద్దకు వెళ్లాలంటే గుంపులుగా కలసి వెళ్లాలని, సాయంత్రం నాలుగు గంటల దాటక ముందే తిరిగి ఇళ్లకు చేరుకోవాలని, ఆరు బయట నిద్రించవద్దని కూడా అటవీ శాఖ అధికారుల తెలిపారు.


Tags:    

Similar News